JVD DOUBTS AND ANSWERS | MUST READ | DIPLOMA Helper 4u | JVD DOUBTS


✍️తాజా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తేదీ నవంబర్ 10 ,2023 నుండి జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాలను పొందాలనుకుంటే నగదు జమ అయ్యే బ్యాంకు ఖాతా విద్యార్థి మరియు వారి యొక్క తల్లి  పేరు మీద ఉండాలి

Join In Whatsapp Click Here 

జాయింట్ బ్యాంకు అకౌంట్ ఎవరు ఓపెన్ చేయాలి?

ప్రస్తుతం లబ్ధి పొందుతున్న అందరు విద్యార్థులు జాయింట్ బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయాలి. ప్రస్తుతం 2022-2023 విద్యా సంవత్సరం లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మరియు SC విద్యార్థులు జాయింట్ ఖాతా తెరవవలసిన అవసరం లేదు. తల్లి లేదా తండ్రి లేని విద్యార్థులు వారి సంరక్షకుల తో కలిపి జాయింట్ ఖాతా ను ఓపెన్ చేయాలి.

జాయింట్ ఖాతా ఎలా ఉంటుంది?

కొత్తగా ఓపెన్ చేసే జాయింట్ బ్యాంకు ఖాతా అనేది విద్యార్థి ప్రాథమిక అకౌంట్ హోల్డర్ గా తల్లి / తండ్రి / సంరక్షకులు రెండవ అకౌంట్ హోల్డర్ గా ఉండాలి.

బ్యాంకు యొక్క లావాదేవీలు / ఆపరేషన్ అనేది విద్యార్థి మరియు తల్లి ఇద్దరు కలిపి / వేరు వేరుగా చేసుకునే అవకాశం ఉంటుంది.

జాయింట్ ఖాతాకు డెబిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ / మొబైల్ బ్యాంకింగ్ / ఇతర కార్డులు ఇవ్వబడదు.

బ్యాంకు ఖాతా నుండి నగదును తీయుటకు గాను తప్పనిసరిగా విద్యార్థి మరియు తల్లి యొక్క సంతకాలు ఉండాలి.

విద్యార్థి ఖాతాకు ప్రాథమిక అకౌంట్ హోల్డర్ గా ఉండుట కారణంగా పథకాల లబ్ధి పొందటానికి గాను  జాయింట్ ఖాతా కు తల్లి యొక్క ఆధార్ నెంబరు సీడ్ చేయకూడదు.

కొత్త జాయింట్ ఖాతా ఓపెన్ చేయడానికి ఇటువంటి చార్జి ఉండదు. ఖాతా ఓపెన్ చేయు సమయంలో ఎటువంటి రుసువు అవసరం ఉండదు. విద్యార్థి మరియు తల్లి యొక్క ఇష్టం మేరకు వారు రెగ్యులర్ సేవింగ్ ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు దానికి బ్యాంకు నిర్ణయించిన చార్జీ పేమెంట్ చేయవలసి ఉంటుంది.

జాయింట్ ఖాతా పై చెక్కుబుక్కు తీసుకోవడం అనేది విద్యార్థి మరియు తల్లి యొక్క ఇష్టం మేరకు ఉంటుంది తప్పనిసరిగా తీసుకోవాలని అయితే రూల్ లేదు.

ఒకవేళ తల్లి మరణించినట్టయితే విద్యార్థి మరియు విద్యార్థి యొక్క తండ్రితో జాయింట్ ఖాతాను ఓపెన్ చేయాలి.

జాయింట్ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి?

విద్యార్థి మరియు తల్లి యొక్క 3 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.

విద్యార్థి మరియు తల్లి యొక్క ఆధార్ కార్డు కాపీ 

విద్యార్థి ఐడి కార్డు

ఆధార్ కార్డులో విద్యార్థి యొక్క పూర్తి డేట్ అఫ్ బర్త్ చూపించకపోతే అప్పుడు విద్యార్థి యొక్క బర్త్ సర్టిఫికెట్ లేదా పూర్తి డేట్ అఫ్ బర్త్ ఉన్న కాలేజీలో ఇచ్చినటువంటి స్టడీ సర్టిఫికెట్.

జాయింట్ ఖాతా ఎప్పటి లోపు ఓపెన్ చేయాలి?

తేదీ నవంబర్ 24 2023 లోపు జాయింట్ ఖాతాలను ఓపెన్ చేసి సచివాలయానికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చివరి తేదీ వరకు ఆగకుండా ఈ పనిని త్వరగా చేసుకున్నట్లయితే త్వరలో విడుదల అయ్యే JVD నగదు ఆ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

🔰 *JVD Clarifications*

*Q1: Joint accounts ఎవరు చేయించుకోవాలి ?*
Ans: SC caste category కి చెందిన students కాకుండా (లేదా) 2022-23 సంవత్సరంలో final year పూర్తి అయిన students కాకుండా మిగిలిన వారు చేయించుకోవాలి.

*Q2: Joint account లో ఎవరెవరు ఉండాలి ?*
Ans: Student primary account holder గా ఉండాలి మరియు తల్లి secendary account holder గా ఉండాలి.
Note: ఒకవేళ తల్లిమరనించి ఉంటే తండ్రి/సంరక్షకుడు ఉండవచ్చు.

*Q3: ఒకే తల్లికి ఇద్దరు లేదా ముగ్గురు చదివే పిల్లలు ఉన్నపుడు ఒక్కొకరికి ఒక్కొక account కావాలా లేక ఓకే account చేయవచ్చా?*
Ans: ఒక్కొకరు ఒక్కొకటి చేసుకోవచ్చు (లేదా) అందరూ కలిసి ఒక్కటే కూడా చేసుకోవచ్చు.
అందరూ ఒకటే చేసుకునే సమయంలో primary account holder student's లో ఎవరి course అయితే ఇంకా ఎక్కువ సంవత్సరాలు చదవవలసి ఉన్నదో (అందరికంటే చిన్న వాడు అయితే ఇంకా చాల సంవత్సరాలు కార్స్ ఉంటుంది) ఆ student ని primary holder గా పెట్టి మిగిలిన students ని మరియు తల్లిని secendary holder గా పెట్టాలి.

*Q4: Account ఏ bank లో చేయించాలి?*
Ans: Andhra Pradesh లో Joint account చేసే ఏ bank లో నైనా చేసుకోవచ్చు.

*Q5: Post office లో joint account ఉండవచ్చా?*
Ans: Post office లో joint account చేయరు.

*Q6: చిన్నప్పుడు RDT లో చేసిన joint account సరిపోతుందా?*
Ans: చిన్నప్పుడు student మైనర్ కాబట్టి primary account holder గా mother ఉండి ఉంటారు, అలాకాకుండా student ఏ prinary account holder గా ఉంటే సరిపోతుంది. ఒకసారి bank లో primary ఎవరు ఉన్నారో కనుకోవాలి.

*Q7: Joint account కి ATM card ఉండవచ్చా?*
Ans: ATM లేదా net banking వంటివి ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ services deactivate చేయించుకోవాలి. Check book ఉండవచ్చు.

*Q8: Joint account zero account ఉండవచ్చా?*
Ans: ఉండవచ్చు.

*Q9: Account details sachivalayam లో ఎప్పటిలోగా ఇవ్వాలి?*
Ans: 24th November.

*Q10: Student కి already ఉన్న account లోకి mother ని add చేసి joint account గా మార్చవచ్చా?*
Ans: Yes.

*#JVD*

JVD Joint Account FAQ - ప్రశ్న - సమాదానాలు :

ప్ర: ఒక కుటుంబం లో ఇద్దరి విద్యార్థులు ఉన్నట్లయితే రెండు అకౌంట్స్ ఓపెన్ చేయాలా?

స: అవసరం లేదు ఆ ఇద్దరి పిల్లలకు మరియు తల్లికి ఒకే అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది.

ప్ర: అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక NPCI చేయించుకోవాలా?

స : ఈ యొక్క ఉమ్మడి ఖాతాలకు ఎటువంటి NPCI కూడా అవసరం లేదు.

ప్ర: పోస్టల్ లో కూడా ఉమ్మడి ఖాతా ఓపెన్ చేసుకోవచ్చా?

స : పోస్టల్ లో ఉమ్మడి ఖాతాలు ఇవ్వరు కనుక ఇతర బ్యాంకు లును మాత్రమే సంప్రదించాలి.

ప్ర: ఉమ్మడి ఖాతా ఓపెన్ చేసుకున్నాక ఏమి చేయాలి.

స : ఖాతా ఓపెన్ చేసుకున్నాక విద్యార్థి లేదా తల్లి ఆ ఖాతా యొక్క మొదటి పేజీ కాపీ ని సంబంధిత (household mapped) WEA/ WEDPS కి అందచేయాలి.

ప్ర : ఇప్పుడు అన్ని కులముల విద్యార్థులుకి, మరియు అన్ని ఏడాది విద్యార్థులు కి కూడా ఈ ఉమ్మడి ఖాతా ను తెరువాలా?

స :  2022-23 వ విద్యాసంవత్సరానికి సంబంధించి చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులుకి (అన్ని కులములు కూడా) ఉమ్మడి ఖాతా తెరువనవసరం లేదు. అలానే షెడ్యూల్డ్ కులములుకు చెందిన అన్ని ఏడాదిల విద్యార్థులుకు కూడా తెరువనవసరం లేదు.

ప్ర: ఖాతా తెరువటకు బ్యాంకు లో ఎటువంటి Documents సమర్పించాలి ?

1) తల్లి మరియు విద్యార్థి యొక్క 3 పాస్పోర్ట్ ఫోటోలు

2) విద్యార్థి మరియు తల్లి యొక్క ఆధార్ కార్డు

3) విద్యార్థి ఐడి కార్డ్ (కాలేజీ ఐడి)

4) ఆధార్ కార్డు లో విద్యార్థి పూర్తి డేట్ ఆఫ్ బర్త్ లేని యెడల DOB సర్టిఫికెట్ లేదా 10వ తరగతి మార్కుల మెమో.

ప్ర: ఖాతా లో మినిమం అమౌంట్ 1000రూ లేదా 3000రూ ఉంచాలా?

స :అవసరం లేదు అకౌంట్ పూర్తిగా జీరో అకౌంట్ కావున సొమ్ము ని జమ చేయనవసరం లేదు.

ప్ర: ఉమ్మడి ఖాతా తెరిచేటపుడు Primary అకౌంట్ హోల్డర్ ఎవరు ఉండాలి?

స: primary అకౌంట్ హోల్డర్ స్టూడెంట్ మాత్రమే ఉండాలి.

ప్ర: విద్యార్థి ఇదివరకే ఇండి విడ్యువల్ ఖాతా కలిగి ఉంటే తల్లిని వారి ఖాతాకు కానీ లేదా తల్లి ఇదివరకే ఇండివిడ్యువల్ ఖాతా కలిగి ఉంటే విద్యార్థిని వారి ఖాతాకు జోడించవచ్చా?

స: లేదు కచ్చితంగా నూతనంగా మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకనగా ఈ అకౌంట్కు ఎటువంటి డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉండకూడదు. కనుక నూతన అకౌంట్ కచ్చితంగా ఓపెన్ చేసుకోమనండి.

ప్ర: తల్లి మరణించి ఉన్న విద్యార్థులుకు ఏమి చేయాలి?

స: వాళ్ళ Father లేదా సంరక్షకుడు తో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి.


Recent Posts